![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -90 లో......గాయత్రి ఇంట్లో నుండి పారిపోవడానికి తనకి కాపలా ఉన్నా బామ్మని డైవర్ట్ చేసి బయటకు వస్తుంది. ఎదురుగా తాయారు ఉంటుంది. తనని చూసి గాయత్రి షాక్ అవుతుంది. ఎక్కడికి వెళ్తున్నావని అడుగుతుంది చేతిలో ఉన్న బ్యాగ్ తీసుకొని చూస్తుంది. అందులో నగలు సర్టిఫికెట్స్ ఉంటాయి. ఇవి తీసుకొని ఎక్కడికీ వెళ్తున్నావని గాయత్రీని లోపలికి లాక్కొని వెళ్తుంది తాయారు. బావని పెళ్లి చేసుకోవడానికి వెళ్తున్నానని గాయత్రి చెప్పగానే తాయారు షాక్ అవుతుంది. అక్కడ నా కోసం ఎదురు చూస్తున్నారు.. నేను వెళ్ళాలని గాయత్రి అంటుంది.
మరొకవైపు గాయత్రి కోసం పెళ్లి ఏర్పాట్లు చేసి అందరు ఎదురు చూస్తారు. ఇంకా రాకపోయేసరికి డౌట్ వస్తుంది. ఫోన్ చేస్తే స్విచాఫ్ వస్తుంది. ఇంత దూరం వచ్చాక ఇక అసలు లేట్ చేయొద్దు ఎలాగైనా పెళ్లి జరగాలి.. మనం వెళ్లి తనని తీసుకొని వద్దామని కేశవ, చక్రిని తీసుకొని మహా వెళ్తుంది. తాయారు వాళ్ళ ఇంటికి వెళ్లి డోర్ కొడుతారు. చాలా సేపటికి గాయత్రి డోర్ తీస్తుంది. నీ ఫోన్ ఎందుకు కలవడం లేదు. మీ వాళ్ళు ఇంట్లో ఉన్నారా పదా.. నీ కోసం పెద్ది ఎదురు చూస్తున్నాడని మహా అనగానే నేను ఎక్కడికి రానని గాయత్రీ అనగానే అందరు షాక్ అవుతారు. హేయ్ నీకేమైనా పిచ్చి పట్టిందా అని కేశవ అంటాడు. నువ్వే కదా పెళ్లి ఇష్టం అన్నావ్.. అందుకే పెళ్లి ఏర్పాట్లు చేసానని మహా అంటుంది. ఇప్పుడు చెప్తున్నా కదా నా ఆలోచన మార్చుకున్నాను.. నాకు బావ అంటే ఇష్టం లేదు.. మీరు ఇక్కడ గొడవ చెయ్యకండి.. ఇక్కడ నుండి వెళ్లిపోండి అని గాయత్రి అంటుంది.
దాంతో మహా తన చెంపచెల్లుమనిపిస్తుంది. ఎందుకు పెద్దికి లేని ఆశలు పెట్టావ్.. ఎందుకు ఆ ఇంటి చుట్టూ చేరి తన వెంటపడ్డావ్.. నీది ప్రేమ కాదు మోసం అని మహా తిడుతుంది. నువ్వు ఇంకొకసారి ఆ ఇంటి వైపు కన్నెత్తి చుసినా నా చేతుల్లో చస్తావ్ పోమని కేశవ వార్నింగ్ ఇస్తాడు. దాంతో అందరు అక్కడ నుండి వెళ్ళిపోతారు. గాయత్రి లోపలికి వెళ్లి ఏడుస్తుంది. అసలు దానికంటే ముందు ఏం జరుగుతుందంటే.. మహా వాళ్ళ దగ్గరికి గాయత్రీ వెళ్లే కంటే ముందు తాయారు చచ్చిపోతానని బెదరిస్తుంది. దాంతో గాయత్రి అలా మాట్లాడుతుంది. తరువాయి భాగంలో మాధవకి నారాయణ డ్రింక్ పోస్తాడు. అది తాగి మాధవ ఎమోషనల్ అవుతూ గాయత్రిపై ఉన్న ప్రేమని చెప్తుంటే అందరు ఎమోషనల్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |